30 దాటిందా... ఎముకలు జాగ్రత్త
close
Published : 24/06/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30 దాటిందా... ఎముకలు జాగ్రత్త

మహిళల్లో 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకలుబలహీనమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి...

పాల ఉత్పత్తులు... పాలు, పెరుగు, చీజ్‌... లాంటి పాల ఉత్పత్తుల నుంచి క్యాల్షియం, ప్రొటీన్‌, విటమిన్‌-డి లభిస్తాయి. ఇవి ఎముకలు బలంగా ఉండేందుకు సాయపడతాయి. వీటితో పొట్ట నిండినట్టయ్యి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. బరువు పెరుగుతామనే భయమూ ఉండదు.

చిరుధాన్యాలు... అత్యావశ్యక పోషకాలు, పీచు... లాంటివి గోధుమ, జొన్న, రాగులు, బ్రౌన్‌రైస్‌లలో మెండుగా ఉంటాయి. ఎముక ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు రోగనిరోధక శక్తినీ అందిస్తాయి.

గుడ్లు... మాంసకృత్తులు మెండుగా ఉంటాయి.  కండరాలు, ఎముకలను బలంగా మారుస్తాయి. అలసట, నిస్సత్తువ లాంటివి దరిచేరకుండా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని