ఫ్రీ హిట్‌లా ‘ఫ్రీ బాల్‌’ ఇవ్వండి మరి! - give free ball to bowler
close
Published : 25/08/2020 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్రీ హిట్‌లా ‘ఫ్రీ బాల్‌’ ఇవ్వండి మరి!

బ్యాట్స్‌మన్‌  క్రీజు దాటి వెళ్తే 5 పరుగుల కోత విధించండి: అశ్విన్‌ 

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ‘అశ్విన్‌ను మన్కడింగ్‌ చేయనివ్వను. అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం’ అని దిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ ఏ ముహూర్తాన అన్నాడో క్రికెట్‌ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. బంతి వేయకముందే క్రీజు దాటిన బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయొచ్చని నిబంధనల్లో ఉందని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. అలాంటప్పుడు ‘మన్కడింగ్‌’ తప్పెందుకు అవుతుందని ప్రశ్నించాడు. దానిని చూసే దృక్పథం మారాలని కోరాడు. అతడి వ్యాఖ్యలపై రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు.

మన్కడింగ్‌ చేసినప్పుడు బౌలర్‌కు ‘ఫ్రీ బాల్‌’ ఇస్తే బాగుంటుందని అశ్విన్‌ సూచించాడు. ‘అవును.. అప్పుడు బౌలర్‌కు ఫ్రీ బాల్‌ ఇవ్వండి. బంతి వేసేముందే బ్యాట్స్‌మన్‌ క్రీజు దాటితే బ్యాటింగ్‌ జట్టు నుంచి 5 పరుగులు తగ్గించాలి. ఫ్రీహిట్‌తో లాభమంతా బ్యాట్స్‌మన్‌కే కదా. అలాగే బౌలర్లకూ అవకాశం ఇవ్వండి’ అని అతడు‌ కోరాడు. ‘ఇప్పుడంతా బౌలింగ్‌ను ఎలా చితకబాదుతారో అన్న ఆసక్తితోనే క్రికెట్‌ చూస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నో బాల్‌ వేస్తే బ్యాట్స్‌మెన్‌కు ఫ్రీహిట్‌ ఇచ్చినట్టు బ్యాటర్‌ ముందే బయటకు వస్తే బౌలర్‌కు ‘ఫ్రీ బాల్‌’ ఇవ్వాలని యాష్‌ ఉద్దేశం.

గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సారథిగా ఉన్న అశ్విన్‌ మన్కడింగ్‌ చేశాడు. మైదానంలోనే బట్లర్‌ దీనిపై అసహనం వ్యక్తం చేశాడు. చాలామంది క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా పేర్కొన్నారు. మరికొందరు యాష్‌ను సమర్థించారు. అయితే తాను సిగ్గుపడనని, నిబంధనల ప్రకారమే చేశానని అతడు‌ నొక్కిచెప్పాడు. ఇప్పుడు అశ్విన్‌‌ దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలోనే పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని