పూజాను చూసి అఖిల్‌ ఫిదా..! - guche gulabi lyrical out now from mlb
close
Published : 13/02/2021 13:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూజాను చూసి అఖిల్‌ ఫిదా..!

హైదరాబాద్‌: పూజాహెగ్డేను చూసి అఖిల్‌ ఫిదా అయ్యారు. ఆమె సౌందర్యాన్ని చూస్తూ.. మాటల్ని వింటూ నవ్వుతూ అలాగే నిల్చుండిపోయారు. అయితే ఇదంతా కేవలం సినిమాలో మాత్రమే. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ విడుదలయ్యింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా  ‘గుచ్చే గులాబిలాగా’ అంటూ సాగే ఓ పాటను చిత్రబృందం సినీప్రియులతో పంచుకుంది. ఇప్పటికే విడుదలైన ‘మనసా మనసా’ పాట ప్రేక్షకుల్ని అలరిస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు విడుదలైన సరికొత్త పాట కూడా హృదయాలను హత్తుకునేలా ఉంది.

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌ నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ స్వరాలు అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘గుచ్చే గులాబిలాగా’ పాటను అర్మాన్‌మాలిక్‌ అలపించారు. జూన్‌ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి

రాజమౌళి మాట నమ్మాలనుకోవడం లేదు
సుమంత్‌ పెళ్లి వేడుకలు షురూ!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని