వేదికపైనే కుప్పకూలిన గుజరాత్‌ సీఎం - gujarat cm vijay rupani collapsed on stage in vadodara
close
Published : 15/02/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేదికపైనే కుప్పకూలిన గుజరాత్‌ సీఎం

వడోదర: గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ అస్వస్థతకు గురయ్యారు. వడోదర ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా అనారోగ్యంతో వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో తేరుకున్న భద్రతా సిబ్బంది, భాజపా నాయకులు ఆయనను పట్టుకున్నారు. అనంతరం వేదికపైనే ప్రథమ చికిత్స అందించి విమానంలో అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రూపానీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.

గత కొన్ని రోజుల నుంచి సీఎం విజయ్‌ రుపానీ వరుసగా ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. ఆదివారం ఒక్కరోజే ఆయన మూడు బహిరంగసభలో పాల్గొన్నారు. గత రెండు రోజుల నుంచి రూపానీ ఆరోగ్యం బాగా లేనప్పటికీ, ఆయన ర్యాలీల్లో  పాల్గొనేందుకే ఇష్టపడ్డారని భాజపా నేత ఒకరు చెప్పారు. గుజరాత్‌లో వడోదర సహా ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 28న మున్సిపాలిటీలకు, జిల్లాలు, తాలుక పంచాయతీలకు ఎన్నికల సంఘం ఎన్నికలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్‌ రూపానీ  రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

ఇదీ చదవండి..
దేశమంతా తిరిగి మద్దతు కూడగడతాంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని