కరోనా నుంచి కోలుకున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ - harmanpreet kaur recovered form coronavirus
close
Updated : 16/04/2021 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నుంచి కోలుకున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌

(Photo: Harmanpreet Kaur Twitter)

దిల్లీ: టీమ్‌ఇండియా మహిళా జట్టు టీ20 సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆమే స్వయంగా వెల్లడించారు. మార్చి 30న తనకు కరోనా సోకిందని ఆమె సామాజిక మాధ్యమాల్లో బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే రెండు వారాలు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ టెస్టులో తనకు నెగిటివ్‌గా తేలిందన్నారు.

‘అందరికీ ఈ విషయం తెలియజేయడానికి సంతోషంగా ఉంది. తాజా పరీక్షలో నాకు కొవిడ్‌ నెగిటివ్‌గా వచ్చింది. ఇప్పుడు కోలుకొని బాగా ఉన్నా. నేను మీ అందరికీ ఒకే విషయం చెప్పదల్చుకున్నా. జాగ్రత్తగా ఉంటూ కచ్చితమైన నిబంధనలు పాటించండి. కరోనా వైరస్‌ అనేది నిజం. చాలా ప్రమాదకరం కూడా. అధికారులు చెప్తున్న అన్ని నియమాలూ కచ్చితంగా పాటించండి. ఇప్పుడు కరోనాతో పోరాడుతున్న వారంతా మరింత బాగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ హర్మన్‌ ట్వీట్‌ చేశారు. కాగా, మార్చిలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడుతుండగా ఆమె గాయపడ్డారు. ఆపై ఆమె టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్నాక వైరస్‌ బారిన పడ్డారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని