మరో మెగా హీరోకు కరోనా - hero varun tej tested corona positive
close
Published : 30/12/2020 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో మెగా హీరోకు కరోనా

హైదరాబాద్‌: తాను కరోనా బారిన పడినట్లు మంగళవారం ఉదయం కథానాయకుడు రామ్‌చరణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, మరో మెగా హీరో కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.

‘ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. త్వరలోనే తిరిగి వస్తా. మీ ప్రేమకు ధన్యవాదాలు’’ -ట్విటర్‌లో వరుణ్‌తేజ్‌

ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు, వెంకటేశ్‌తో కలిసి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌3’లో కూడా సందడి చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని