ప్రణిత ‘శభాష్‌’.. ఉచితంగా వ్యాక్సినేషన్‌ - heroine pranitha subhash conducts free vaccination drive
close
Updated : 16/06/2021 16:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రణిత ‘శభాష్‌’.. ఉచితంగా వ్యాక్సినేషన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రణిత సుభాష్‌.. అందమైన రూపంతో పాటు అంతే అందమైన మనసు ఉన్న నటి. ఆమె కేవలం నటిగానే కాదు.. సమాజ సేవకురాలిగానూ స్ఫూర్తిగా నిలుస్తోంది. తనను ఆదరించి ఈ స్థాయిలో నిలబెట్టిన సమాజానికి ఏదో ఒకటి చేయాలని భావించిన ఆమె ‘ప్రణిత ఫౌండేషన్‌’ పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె చేస్తున్న సేవలు ప్రశంసణీయం. పలువురు కన్నడ సినీ కార్మికులకు ఆమె ఉచితంగా రేషన్‌ అందజేసింది. అన్నార్తుల కోసం స్వయంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. తాజాగా.. ఆమె మరో అడుగు ముందుకేసింది. కరోనా నేపథ్యంలో ‘ఫ్రీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌’ చేపట్టాలని నిర్ణయించింది. ప్రణిత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో బుధవారం ఈ ఉచిత టీకా కార్యక్రమం ఏర్పాటు చేయించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం హాజరై వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. పెళ్లయిన తర్వాత తమ సొంత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి రోజుల్లో ప్రణిత ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

బెంగళూరుకు చెందిన ప్రణిత కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. త్వరలోనే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టబోతోంది. తెలుగులో ‘బావ’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుందామె. మే 30న వ్యాపారవేత్త నితిన్‌రాజును వివాహం చేసుకుంది. అయితే.. ప్రణితకు ఇలాంటి సేవా కార్యక్రమాలు కొత్తకాదు. ఆమె ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామిగా ఉంది. 2019లో మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌తోపాటు ప్రణితను ఓటింగ్‌పై చైతన్యం పెంచే ప్రచార రాయబారిగానూ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని