WHO: భారత్‌లో 13% తగ్గిన కొత్త కేసులు - india logs 13 per cent fall in new covid19 cases in week still highest globally who
close
Updated : 19/05/2021 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WHO: భారత్‌లో 13% తగ్గిన కొత్త కేసులు

జెనీవా: గడచిన వారం రోజుల్లో భారత్‌లో కరోనా కేసులు 13 శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాజా కేసుల నమోదులో మాత్రం భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. మే 16 వరకు నమోదైన కేసులను.. అంతకు ముందు వారంతో పోలిస్తే గత వారం తాజా కేసుల్లో 13శాతం, మరణాల్లో 5శాతం తగ్గుదల ఉన్నట్లు వీక్లీ రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తాజా కేసులు నమోదవుతున్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్‌ ఉండగా.. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌, అమెరికా, అర్జంటీనా, కొలంబియా ఉన్నట్లు తెలిపారు. తాజా మరణాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో నేపాల్‌, ఇండోనేసియా ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలోని అన్ని రీజియన్లలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ నివేదికలో వెల్లడించింది.

భారత్‌లో కేసుల పెరుగుదల ఇలా..

గతేడాది ఆగస్టు 7న భారత్‌ 20 లక్షల కరోనా కేసుల మార్కుకు చేరుకుంది. ఆగస్టు 23న 30లక్షలు, సెప్టెంబరు 5న 40 లక్షలు, సెప్టెంబరు 16న 50లక్షలకు చేరుకుంది. డిసెంబరు 19న కోటి మార్కుకు చేరుకున్న భారత్‌ ఈ ఏడాది మే 4కు 2కోట్లకు చేరుకుంది. కాగా ప్రస్తుతం భారత్‌లో 32,26,719 క్రియాశీల కేసులు ఉండగా 18,58,09,302 మంది టీకాలు వేయించుకున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని