సిద్ధంగా ఉండండి.. ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌3’ వచ్చేస్తోంది  - inside edge season 3 to premiere soon
close
Published : 22/06/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిద్ధంగా ఉండండి.. ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌3’ వచ్చేస్తోంది 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొదటి రెండు సీజన్లకు మంచి ఆదరణ రావడంతో ముచ్చటగా మూడోసారి కూడా అలరించేందుకు సిద్ధమైంది ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’. తాజాగా ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ 3’ లోగో విడుదలైంది. క్రికెట్‌ లీగ్‌లో జరిగే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చుట్టూ తిరిగే కథతో ఈ స్పోర్ట్స్‌ డ్రామా సిరీస్‌ను తెరకెక్కించారు. ఇందులో వివేక్‌ ఒబ్‌రాయ్‌, రీచా చద్దా, సయని గుప్తా, ఆమిర్‌ బషీర్‌, తనూజ్‌ విర్వాణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కరణ్‌ అన్షుమాన్‌ దర్శకుడు. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. కాగా.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ముంబయి మార్వల్స్‌ జట్టు రెండేళ్ల నిషేధానికి గురవడంతో రెండో సీజన్‌ ముగిసింది. మూడో సీజన్‌లో మరింత క్రికెట్‌.. రెట్టింపు డ్రామా.. ఎక్కువ వినోదం ఉంటుందని అమెజాన్‌ పేర్కొంది. త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని ప్రకటించింది. మరి క్రికెట్‌ అభిమానులతో అటు సినిమా ప్రియులు సిద్ధంగా ఉండండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని