‘దోస్తానా 2’లో కార్తిక్‌ ఆర్యన్‌ నటించడం లేదా?    - isnt karthik aryan starring in dostana 2
close
Published : 16/04/2021 14:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దోస్తానా 2’లో కార్తిక్‌ ఆర్యన్‌ నటించడం లేదా?   

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ 2019లో ‘దోస్తానా2’ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. కోలిన్‌ డికున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో జాన్వీ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, లక్ష్య లల్వాని నటిస్తున్నారు. 2019 నవంబర్లో‌నే సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఈ చిత్రకథకు సంబంధించి హీరో కార్తీక్‌ కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. అందుకు నిర్మాత కరణ్‌జోహార్‌ సైతం అంగీకారం తెలిపారట. కానీ కార్తిక్‌ కాల్షీట్స్ సరిగ్గా కేటాయించకపోవడంతో అతని స్థానంలో మరొకరిని తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి కార్తిక్‌ స్థానంలో ఎవరు వస్తారో చూడాలి. ఈ మధ్యే కార్తిక్‌ కొవిడ్‌ భారిన పడ్డారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నాడు. త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానున్న ‘ధమాకా’ చిత్రం కోసం డబ్బింగ్‌ చెప్పాడు. ప్రస్తుతం కార్తిక్‌ - అనీష్‌ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ చిత్రం ‘భూల్‌ భులయ్య2’లో నటిస్తున్నాడు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని