ప్రతిభకు పట్టంకట్టేలా పద్మ అవార్డులు : పవన్‌ - janasena chief pawan on padma awards
close
Published : 27/01/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతిభకు పట్టంకట్టేలా పద్మ అవార్డులు : పవన్‌

అమరావతి: ప్రతిభావంతులకు పట్టంకట్టే విధంగా పద్మ పురస్కారాల ఎంపిక జరిగిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ‘పద్మవిభూషణ్‌’ పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన నేపథ్యంలో పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సినీ సంగీత రంగంపై ఎస్పీ బాలు ముద్ర చెరగనిదని కొనియాడారు. మరణానంతరం పురస్కారానికి ఎంపిక చేయడం ఆయన కీర్తిని మరింత పెంచిందన్నారు. ప్రముఖ గాయని చిత్రను ‘పద్మభూషణ్‌’కు ఎంపిక చేయడం సంతోషకరమని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది భాషలతో పాటు పలు ఇతర భాషల్లో తన గళంతో శ్రోతలను మైమరిపించారన్నారు. 

వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాంసురాలు సుమతి, అవధాన విద్యలో దిట్టగా నిలిచిన ఆశావాది ప్రకాశరావు, ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్న కనకరాజులను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేయడం కళలకు మరింత జీవం పోసినట్లయిందన్నారు. వీరందరికీ తనతో పాటు జనసేన తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నట్లు పవన్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

గానగంధర్వుడికి పద్మవిభూషణ్‌

మహావీరుడు మన సంతోష్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని