ఆశాకిరణంలా కబాసురా కుడినీర్‌ ఔషధం - kabasura kudineer ayurvedic medicine is really showing good results says sri sri ravishankar
close
Updated : 02/12/2020 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆశాకిరణంలా కబాసురా కుడినీర్‌ ఔషధం

రోగనిరోధకశక్తిని పెంచుతోందన్న శ్రీశ్రీ రవిశంకర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వ్యాధి చికిత్సలో సిద్ధ వైద్యం ఆశాకిరణంలా కనిపిస్తోంది. కొవిడ్‌పై పోరాటంలో రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లు జర్మనీకి చెందిన ప్రాంక్‌ఫర్డ్‌ సంస్థ పరిశోధనలో తేలింది. ఆయుర్వేదం, సిద్ధ వైద్యం కలయికలో రూపొందించిన కబాసుర కుడినీర్‌ ఔషధం కొవిడ్‌-19పై పోరులో సత్పలితాలు ఇస్తున్నట్లు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రకటించారు. కరోనా బాధితులకు అందించిన కబాసుర ఔషధంతో ఇప్పటివరకు మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ఈ సిద్ధవైద్య ఔషధాల పరిశోధన, తయారీలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు చెందిన తత్వ సంస్థ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ ప్రయోగాల గురించి, వాటి ప్రాథమిక ఫలితాల గురించి నిర్వహించిన ఒక వెబ్‌నార్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌ పలు వివరాలు వెల్లడించారు. 

బెంగళూరులోని నారాయణ హృదయాలయ సంస్థ జరిపిన మరో పరిశోధనలో కబాసుర కుడినీర్‌ ఔషధం తీసుకున్న బాధితుల్లో ఎలాంటి అవాంఛనీయ ప్రభావం కనిపించలేదని ఈ సందర్భంగా రవిశంకర్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఔషధం తీసుకున్న వారిలో రోగనిరోధకశక్తి పెరిగి వ్యాధిని తట్టుకొని ఆరోగ్యవంతులయ్యారని పేర్కొన్నారు.
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని