close
Published : 12/03/2021 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుకుమార్‌ బ్యానర్‌పై కార్తికేయ చిత్రం

హైదరాబాద్‌: కథానాయకుడు కార్తికేయ తదుపరి ప్రాజెక్ట్‌ సిద్ధమయ్యింది. ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ రిలీజ్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కార్తికేయ త్వరలో ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుకుమార్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అలాగే, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని ఆయనే అందించనున్నారు. దర్శకత్వం, ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కార్తికేయ కథానాయకుడిగా నటించిన ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కౌశిక్‌ పగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా లావణ్య త్రిపాఠి నటించారు. మరోవైపు, ప్రస్తుతం సుకుమార్‌ ‘పుష్ప’ చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని