Katrina Kaif: 15 ఏళ్లుగా అదే ప్రశ్న అడుగుతున్నారు: కత్రిన - katrina kaif breaks silence on reports of her wedding with vicky kaushal
close
Published : 28/10/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Katrina Kaif: 15 ఏళ్లుగా అదే ప్రశ్న అడుగుతున్నారు: కత్రిన

ముంబయి: బాలీవుడ్‌ నటులు కత్రినాకైఫ్‌- విక్కీ కౌశల్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, వచ్చే నవంబర్‌-డిసెంబర్‌ నెలలో రాజస్థాన్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటవుతున్నారనే వార్తలు ఇటీవల నెట్టింట చక్కర్లు కొట్టాయి. గతంలోనూ వీరి వివాహం గురించి ప్రచారం జరిగింది. ఇన్నాళ్లు ఈ విషయంపై మౌనం వహించిన కత్రినా కైఫ్‌... తొలిసారి దీనిపై స్పందించింది. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్కీకౌశల్‌తో వివాహం అంటూ వస్తున్న వార్తలను ఖండించింది.

‘‘15 ఏళ్లుగా మీకు పెళ్లంట కదా’ అని ప్రశ్నిస్తూనే ఉన్నారు. విక్కీతో నా పెళ్లి అనేది పూర్తిగా అవాస్తవం. మా ఇద్దరికీ అలాంటి ప్లాన్స్‌ లేవు. అయినా సోషల్‌ మీడియాలో నెలకో స్టోరీ రాస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ రూమర్స్‌ని పట్టించుకునేంత తీరికే నాకు లేదు. షూటింగ్స్‌తోనే నా జీవితం బిజీగా గడిచిపోతుంది. నా దృష్టి అంతా నా పనిమీదే’’ అంటూ వదంతులను కొట్టిపారేశారు. ఇక సినిమాల విషయానికొస్తే అక్షయ్‌ కుమార్‌ సరసన ‘సూర్యవంశీ’లో కత్రినా కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్‌ 5న థియేటర్లలో సందడి చేయనుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని