నిజం సూర్యుడిలాంటిది: కృతి సనన్‌ - kriti sanon posted a deep meaningful messege in social media
close
Updated : 09/08/2020 10:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిజం సూర్యుడిలాంటిది: కృతి సనన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి బాలీవుడ్‌లో కొందరి మనసులను ఇంకా కలిచివేస్తోంది. ముఖ్యంగా సుశాంత్‌ ఎందుకు?ఎలా మృతి చెందాడన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో సుశాంత్‌ సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. సుశాంత్ అభిమానుల ‘వారియర్స్‌ ఫర్‌ ఎస్‌ఎస్‌ఆర్’ నినాదం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. మరోవైపు సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తి ఈడీ ఎదుట హాజరైంది. ఈ నేపథ్యంలో నటి కృతి సనన్‌ సోషల్‌ మీడియాలో ఓ గూడార్థమున్న పోస్ట్‌ పెట్టింది. 

‘‘మబ్బులు కమ్ముకున్నాయి. పొగ మంచు కప్పి ఉంది. స్పష్టంగా ఏదీ కనిపించట్లేదు. కానీ నిజం సూర్యుడు లాంటిది. అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది. కాబట్టి అనుమానాలు వద్దు. సహనంతో వేచి చూడండి. కాసేపు గాలి వీచొచ్చు.. వర్షాలు పడొచ్చు. కానీ మిత్రమా గుర్తుపెట్టుకో..! కొన్ని సార్లు సూర్యుడు ప్రకాశించడం కోసం ఉరుములు దారి ఇస్తాయి’’అని పోస్టులో రాసుకొచ్చింది. హ్యాష్‌ ట్యాగ్‌తో పేషెన్స్‌(సహనం) అని కామెంట్‌ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్‌గా మారింది.

కృతి సనన్‌ సుశాంత్‌సింగ్‌తో కలిసి ‘రబ్తా’ చిత్రంలో నటించింది. చిత్రీకరణ సమయంలో వీరద్దరు మంచి స్నేహితులుగా మారారు. ముంబయిలో జరిగిన సుశాంత్‌ అంత్యక్రియలకు కృతి కూడా హాజరైంది. సుశాంత్‌ చివరి చిత్రం ‘దిల్‌ బెచారా’చూసిన తర్వాత సుశాంత్‌ను ఉద్దేశించి కృతి సోషల్‌మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని