మాస్క్‌లు లేకుండా బర్త్‌డే పార్టీ.. మంత్రికి కరోనా - maha minister jayant patil tests positive for coronavirus
close
Updated : 18/02/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌లు లేకుండా బర్త్‌డే పార్టీ.. మంత్రికి కరోనా

ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం గత కొన్నిరోజులుగా కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రజలు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అక్కడ ఓ మంత్రి పుట్టినరోజు వేడుకలు జరగ్గా.. అందులో ఎవరూ మాస్క్‌లు పెట్టుకోలేదట. తాజాగా ఆ మంత్రి కరోనా బారిన పడ్డారు. 

మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేను ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వైద్యుల సలహాలు పాటిస్తున్నాను. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నా. అప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విధులు నిర్వర్తిస్తాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరుతున్నా’ అని పాటిల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఫిబ్రవరి 16న జయంత్‌ పాటిల్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ముంబయిలోని మలద్‌ ఎస్టేట్‌లో జరిగిన ఈ వేడుకల్లో అనేక మంది పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పాల్గొన్నారు. అయితే, అందులో ఎవరూ సామాజిక దూరం పాటించకపోగా.. కనీసం మాస్క్‌లు కూడా ధరించలేదని వార్తాకథనాలు వచ్చాయి. అంతకుముందు పాటిల్‌ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పరివార్‌ సంవద్‌ యాత్రలో పాల్గొన్నారు. 

మహారాష్ట్రలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు మూడు వేలకు పైనే ఉంటున్నాయి. బుధవారం ఏకంగా రికార్డు స్థాయిలో 4,700పైన కొత్త కేసులు నమోదయ్యాయి. 40 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. నిబంధనలు పాటించకపోతే మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తామని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని