కరోనాతో మిల్కాసింగ్‌ సతీమణి కన్నుమూత - milkha singh wife nirmal kaur passes away due to corona
close
Updated : 13/06/2021 23:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో మిల్కాసింగ్‌ సతీమణి కన్నుమూత

మొహాలీ: భారత మహిళల వాలీబాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌, లెజెండరీ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ సతీమణి నిర్మల్‌ కౌర్‌(85) కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె మరణవార్తను కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. గతనెలలో కరోనా బారిన పడ్డ మిల్కాసింగ్‌ దంపతులు మే 26న మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నిర్మల్‌ కౌర్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె చివరిశ్వాస విడిచారు. కాగా కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మిల్కాసింగ్‌   న్యుమోనియాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చండీగఢ్‌లోని జిప్‌మర్‌ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్‌ కౌర్‌ అంత్యక్రియలకు ఆయన రాలేని పరిస్థితి నెలకొంది. మిల్కాసింగ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. మిల్కాసింగ్‌-నిర్మల్‌ కౌర్‌ దంపతులకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని