కరోనా బాధితుల్లో ఆరు నెలల తర్వాత కూడా...  - most covid-19 patients have at least one symptom after 6 months
close
Updated : 10/01/2021 06:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా బాధితుల్లో ఆరు నెలల తర్వాత కూడా... 

ఏదో ఒక లక్షణంతో బాధ పడుతున్న బాధితులు

ప్యారిస్‌: కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన మూడొంతుల మంది ఆరునెలల తరువాత కూడా ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈమేరకు ప్రముఖ వైద్య పత్రిక ‘ద ‌లాన్సెట్’‌లో ఈ విషయం ప్రచురితమైంది. కరోనా పుట్టుకకు వేదికైన చైనాలోని వుహాన్‌లో వందల మంది కొవిడ్‌-19 బారిన పడిన వారిని పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని వారు తెలిపారు. దీంతో కరోనా వైరస్‌ ప్రభావాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

కరోనా నుంచి కోలుకున్నవారిలో కండరాలు బలహీనపడటం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలను గమనించినట్లు ప్రధానంగా గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కరోనా బారిన పడిన వారి ఆరోగ్యంపై వైరస్ దీర్ఘకాలిక ఎలా‌ ప్రభావాలను చూపుతుందో అర్థం చేసుకుంటున్నామని నేషనల్ సెంటర్ ఫర్ రెస్పిరేటరీ మెడిసిన్ ప్రధాన శాస్త్రవేత్త బిన్ కావో చెప్పారు. కరోనా నుంచి డిశ్ఛార్జి అయిన 1655 మంది బాధితులను పరిశీలించగా 1265 మందిలో ఏదో ఒక లక్షణం గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఇందులో 63 శాతం మంది కండరాల బలహీనతతో, 26 శాతం నిద్రలేమితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ బారిన పడిన వ్యక్తుల్లోని యాంటీబాడీల స్థాయిలను పరిశీలించగా.. రోగనిరోధక స్థాయి 52.5 శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు వివరించారు. 

ఇవీ చదవండి..

అమెరికా, బ్రిటన్‌ వ్యాక్సిన్లు మాకొద్దు: ఇరాన్‌

వ్యాక్సిన్‌ తీసుకున్న అధినేతలు ఎవరంటే..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని