కింగ్‌ నాగార్జున కొత్త చిత్రం ప్రారంభం! - nagarjun praveen sattatu new picture start
close
Updated : 16/02/2021 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కింగ్‌ నాగార్జున కొత్త చిత్రం ప్రారంభం!

హైదరాబాద్‌: ‘పీఎస్‌వీ గరుడ వేగ’ చిత్రంతో మెప్పించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. తాజాగా పూజా కార్యక్రమాన్ని సికింద్రాబాద్‌ గణేష్‌ ఆలయంలో నిర్వహించారు. పశుసంవర్థకశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరై క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్‌ గణేష్‌ ఆలయం అత్యంత శక్తిమంతమైనదని, సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందని అన్నారు. పూర్తి వైవిధ్యమైన అంశాలతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు నటుడు నాగార్జున తెలిపారు. రామ్మోహనరావు నిర్మాతగా వ్యవహిరిస్తున ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రవీణ్‌ సత్తారు వెల్లడించారు. మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని