ఒక్క బెడ్‌పై ఇద్దరు కొవిడ్‌ రోగులు..! - nagpur hospitals filled with covid patients
close
Published : 30/03/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్క బెడ్‌పై ఇద్దరు కొవిడ్‌ రోగులు..!

నాగ్‌పూర్‌లో కిక్కిరిసిన ప్రభుత్వాసుపత్రులు

నాగ్‌పూర్‌: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణ విపరీతంగా ఉంది. కొవిడ్‌ ఉద్ధృతితో నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో పడకలు చాలక.. ఒకే బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

నాగ్‌పూర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి(జీఎంసీహెచ్‌)లో కొవిడ్‌ వార్డు రోగులతో నిండిపోయింది. ఇక్కడి ప్రతి బెడ్డుపై కనీసం ఇద్దరు రోగులు చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న అధిక ఫీజులను తట్టుకోలేకే ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రులకు పోటెత్తుతున్నారని జీఎంసీహెచ్‌ అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ సమస్య తీరిందని, రోగుల రద్దీతో ఆసుపత్రిలో పడకలను పెంచినట్లు ఆసుపత్రి సూపరిండెంట్‌ అవినాశ్‌ గవాండే చెప్పారు. ప్రస్తుతం ఒక బెడ్‌పై ఒకే రోగిని ఉంచినట్లు పేర్కొన్నారు. 

సమయానికి పరీక్షలు చేయించుకోండి..

మరోవైపు కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడే పరీక్షలు చేయించుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్‌ తోప్‌ సూచించారు. పరిస్థితి విషమించిన తర్వాత ఆసుపత్రులకు రావడంతో ఐసీయూలు, ఆక్సిజన్‌ బెడ్లు త్వరగా నిండిపోతున్నాయని ఆయన అన్నారు. అందుకే ముందే పరీక్ష చేయించుకుంటే ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చని అన్నారు. 

మహరాష్ట్రలో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాగ్‌పూర్‌లో 3వేల మందికి పైగా కొత్తగా వైరస్‌ బారినపడగా.. 55 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో నాగ్‌పూర్‌లో ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ కూడా విధించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని