అలా చేస్తే.. జీవితంలో పనిచేయాల్సిన రోజే ఉండదు - natarajan says choose a job that you love and will never have to work in your life
close
Published : 20/03/2021 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా చేస్తే.. జీవితంలో పనిచేయాల్సిన రోజే ఉండదు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ పేసర్‌ నటరాజన్‌ మళ్లీ జట్టుతో కలిశాడు. ఇటీవల భుజం గాయం కారణంగా జట్టుకు దూరమైన అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. వచ్చేవారం ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ నటరాజన్‌ను ఎంపిక చేసింది.

‘బ్లూ జెర్సీలో మళ్లీ టీమ్‌ఇండియా ఆటగాళ్లతో కలవడం ఉత్సాహంగా ఉంది. అలాగే మీకు ఇష్టమైన పనిని వృత్తిగా ఎంచుకోండి. అలా చేస్తే జీవితంలో పనిచేయాల్సిన రోజే ఉండదు’ అని నటరాజన్‌ అన్నాడు. గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేయడంతో ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా నటరాజన్‌ ఎంపికయ్యాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి కొత్త రికార్డు నెలకొల్పడమే కాకుండా తన ఎంపికకు న్యాయం కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంగ్లాండ్‌తో వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని