టీమ్‌ఇండియాకు ఎంపికై రెండేళ్లు కాలేదు..!   - navdeep saini got trolled by netizens after he shared a video of himself
close
Updated : 30/05/2021 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియాకు ఎంపికై రెండేళ్లు కాలేదు..! 

నవ్‌దీప్‌ సైని వీడియోపై నెటిజెన్ల ఆగ్రహం..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైని ఆదివారం ట్విటర్‌లో ఓ వీడియో స్టంట్‌ పోస్టు చేసి నెటిజెన్ల చేత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తన హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. దానికి ‘భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్‌ మీద కూర్చోండి’ అంటూ వ్యాఖ్యానం జతచేశాడు. ఈ పోస్టుకు నెటిజెన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఆ స్టంట్‌ చూసిన కొందరు నవ్‌దీప్‌ను మెచ్చుకోగా మరికొందరు తీవ్రంగా దుయ్యబట్టారు.

‘ఒక క్రికెటర్‌ అయ్యుండి ఇలాగేనా చేసిది?ముందు బౌలింగ్‌ మీద దృష్టి పెట్టు. ఇలాంటి వాటితో ఒరిగేదేం లేదు. జట్టులో కొనసాగాలంటే నిరంతరం కష్టపడాలి. సచిన్‌, వినోద్‌ కాంబ్లీ.. ఇద్దరూ నైపుణ్యమున్న ఆటగాళ్లే. కానీ చివరికి ఎవరెలా ఉన్నారో నీకు తెలుసు కదా. హీరోలా ఎక్కువ చేయకు. నువ్వు ఎంపికై రెండేళ్లు కూడా కాలేదు. కాలుష్య నియంత్రణ అధికారులు ఎవరైనా ఈ వీడియోను చూడండి. ఇలా చేయడం వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. ఎవరైనా సాధారణ యువకులు ఇలా చేస్తే ఊరుకుంటారా?’ అని పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన నవ్‌దీప్‌ ఇప్పుడు ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికవ్వలేదు. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆడే అద్భుత అవకాశాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలోనే నెటిజెన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు. తొలుత ఆట మీద ధ్యాస పెట్టాలని, ఇలాంటివి చేసి ఉన్న పేరు పోగొట్టుకోవద్దని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని