అనుష్క.. నవీన్‌ పోలిశెట్టి.. ఓ ప్రేమకథ? - naveen polishetty bags anushka shetty film
close
Published : 14/03/2021 14:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుష్క.. నవీన్‌ పోలిశెట్టి.. ఓ ప్రేమకథ?

అగ్రకథానాయికతో జోడీకట్టనున్న యువ హీరో

హైదరాబాద్‌: ‘జాతిరత్నాలు’తో కథానాయకుడిగా మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు నవీన్‌ పోలిశెట్టి. ఈ విజయం తర్వాత ఆయనకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే నవీన్‌ను ఓ బంపర్‌ఆఫర్‌ వరించినట్లు తెలుస్తోంది. అగ్రకథానాయిక అనుష్క శెట్టి సరసన నటించే అవకాశాన్ని ఆయన సొంతం చేసుకున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

‘రా రా కృష్ణయ్య’ చిత్ర దర్శకుడు మహేశ్‌ వీరిద్దరితో సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారట. ఈ మేరకు రొమాంటిక్‌ ప్రేమకథను సిద్ధం చేశారట. వయసులో దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న  స్త్రీ, పురుషల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిమాణాలు? అనేది ఈ సినిమాలో చూపించనున్నారంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముందని సోషల్‌మీడియాలో టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ గతేడాది అమెజాన్ ప్రైమ్‌ వేదికగా విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని