సీఎం గారూ.. అభిప్రాయం మార్చుకోండి: నవ్య - navya nanda asks ukhand cm to change mentality over ripped jeans then deletes post
close
Published : 18/03/2021 17:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం గారూ.. అభిప్రాయం మార్చుకోండి: నవ్య

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బిగ్‌బి మనవరాలు అసంతృప్తి

ముంబయి: రిప్‌డ్‌‌ జీన్స్‌ గురించి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలు టోర్న్‌‌ జీన్స్‌ ధరించి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బిగ్‌బి మనవరాలు నవ్య నవేలి నందా అసంతృప్తి వ్యక్తం చేశారు. టోర్న్‌‌ జీన్స్‌ ధరించిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన నవ్య... అలాంటి దుస్తులు వేసుకోవడాన్ని తాను గర్వంగానే ఫీల్‌ అవుతానని తెలిపారు. అనంతరం సీఎం వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. ‘మా వస్త్రధారణను మార్చడానికంటే ముందు మీ అభిప్రాయాలు, ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. మీ వ్యాఖ్యల నుంచి సమాజంలోకి వెళ్లే సందేశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి’ అని నవ్య ఇన్‌స్టాలో పేర్కొంది. తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశారు. కాకపోతే అప్పటికే నవ్య పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇటీవల ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తీరథ్‌‌ సింగ్‌ రావత్‌ మంగళవారం దేహ్రాదూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేశారు. గత కొంతకాలం క్రితం ఓసారి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కన కూర్చొన్న ఓ మహిళ రిప్‌డ్‌‌ జీన్స్‌ ధరించిందని, ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని, ఆమె ఒక ఎన్‌జీవోని సైతం నడుపుతోందని.. ఇలాంటి దుస్తులు ధరించి సభ్య సమాజానికి ఏం సందేశం మెసేజ్‌ ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపడంతో పలువురు స్పందించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నవ్య ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్‌ చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని