సుస్మితను హత్తుకుని ఉద్వేగానికి లోనైన నటి
హైదరాబాద్: ఏ అమ్మాయి జీవితంలోనైనా వివాహమనేది ఓ మధురమైన అనుభూతి. ఎన్నో బంధాలు.. అనుబంధాలు.. భావోద్వేగాలకు వివాహం ఓ వేదికగా మారుతుంది. పుట్టింటి బంధాలకు దూరంగా అత్తవారింటిలోకి అడుగుపెట్టే ప్రతి యువతి పెళ్లి సమయంలో ఉద్వేగానికి లోనవుతుంది. కాగా, నిహారిక సైతం తన పెళ్లి సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆమె ఓ వీడియోని షేర్ చేశారు.
పెళ్లి వేడుకలు ప్రారంభించిన నాటి నుంచి ఎంతో సంతోషంగా ఉన్న నిహారిక పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ సందేశంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ‘ప్రియమైన నిహా.. వివాహబంధంతో మన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. ముప్పైయేళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని తెలిసింది’ అంటూ చైతన్య పంపించిన సందేశం చూసి నిహారిక భావోద్వేగానికి గురయ్యారు.
కల్యాణ తిలకం దిద్దే సమయంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితను హత్తుకుని నిహారిక ఉద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా పెళ్లి మండపంలో మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్‌కల్యాణ్ సరదాగా మాట్లాడుకోవడం.. వరుణ్‌తేజ్, బన్నీ ఆత్మీయ ఆలింగనం.. ఇలా ఎన్నో మధుర క్షణాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి
నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
కీర్తి కూడా వచ్చేస్తున్నారు..!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!