విశాఖ నుంచి బయలుదేరిన తొలి ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ - oxygen express departs from visakapatnam
close
Published : 23/04/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖ నుంచి బయలుదేరిన తొలి ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’

విశాఖ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. దీంతో రైల్వే శాఖ త్వరతగతిన ఆసుపత్రులకు ఆక్సిజన్‌ చేరవేసేందుకు ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో రైలు నడపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆక్సిజన్‌ను నింపుకునేందుకు తొలి ’ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు విశాఖ చేరుకుంది. విశాఖ ఉక్కు కర్మాగారం సిబ్బంది 7 ట్యాంకుల్లో 103 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను నింపారు. రైలు మహారాష్ట్రను వేగంగా చేరేలా రైల్వే అధికారులు గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటుచేశారు. దీంతో రైలు విశాఖ నుంచి మహారాష్ట్రకు బయలుదేరింది. 

లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన మొదటి ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు విశాఖ నుంచి మహారాష్ట్రకు బయలుదేరిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ట్వీట్‌ చేశారు. దేశ పౌరుల శ్రేయస్సు కోసం క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా రైల్వేశాఖ నిరంతరం తన సేవలు కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు.   
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని