పంత్‌.. ధోనీ పని చేసేస్తున్నాడు: రోహిత్‌ - pant doing ms role for team india says rohit
close
Published : 06/03/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంత్‌.. ధోనీ పని చేసేస్తున్నాడు: రోహిత్‌

అహ్మదాబాద్‌: జట్టు యాజమాన్యం చెప్పిన పనిని పూర్తి చేస్తున్నంత వరకు రిషభ్‌ పంత్ ‌బ్యాటింగ్‌ శైలి తమకు ఫర్వాలేదని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అంటున్నాడు. అతడి సత్తా ఏంటో అందరికీ తెలుసని పేర్కొన్నాడు. కొన్నిసార్లు విఫలమైనంత మాత్రాన అతడిని విమర్శించకూడదని వెల్లడించాడు. రెండోరోజు ఆట ముగిశాక అతడు మీడియాతో మాట్లాడాడు.

‘పంత్‌కు తనదైన బ్యాటింగ్‌ శైలి ఉంది. ఇన్నింగ్స్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అతడికి కచ్చితంగా సందేశాలు అందుతూనే ఉంటాయి. అతడు తన సహజశైలిలో ఆడటమే మంచిది. ఎందుకంటే అతడు చెప్పిన పనిని పూర్తిచేయడమే మాకు అత్యంత ముఖ్యం’ అని రోహిత్‌ అన్నాడు. అతడు విఫలమైన సందర్భాల్లో విమర్శించొద్దని సూచించాడు.

‘జట్టులో రకరకాల ఆటగాళ్లు ఉంటారు. కొందరు జాగ్రత్తగా అవతలి వారిని గౌరవిస్తూ ఆడతారు. మరికొందరు ధైర్యంగా దూకుడుగా ముందుకు బాదేస్తారు. నిర్దేశించిన పని ముగిస్తున్నంత వరకు వారితో ఇబ్బందేమీ లేదు. కొన్నిసార్లు పంత్‌ విఫలమైన సందర్భాలూ ఉంటాయి. తన షాట్లకు ఔటవుతుంటాడు. దాంతో ఎవరూ నిరాశపడొద్దని నేనంటాను. ఎందుకంటే అతడి ఆటతీరే అది. కఠిన పరిస్థితులను ఒక్క గంటలో ఆటను మార్చేస్తాడు. అందరూ పంత్‌ను ఇష్టపడతారు. అలాంటి వారికి అండగా నిలవాలి. ఎంఎస్‌ ధోనీ పాత్రను పోషించేందుకు అతనెప్పుడో సిద్ధమైపోయాడు. ఆ పనిని చేస్తున్నాడు కూడా’ అని హిట్‌మ్యాన్‌ తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని