పంచాయతీలు శాసించేస్థాయికి ఎదగాలి: పవన్‌  - pawan kalyan on ap panchyat elections
close
Published : 18/02/2021 22:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంచాయతీలు శాసించేస్థాయికి ఎదగాలి: పవన్‌ 

అమరావతి: దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో పంచాయతీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతుల్లో పెట్టుకొని పంచాయతీలను యాచించే స్థాయిలో పెడుతున్నాయని ఆరోపించారు. ఏపీలో ఇప్పటివరకు జరిగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో యువత, మహిళలు ఎలా బయటకు వచ్చి పోరాడారో, నాలుగో విడతలోనూ అదే స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. మూడో విడతలో 2,639 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే.. జనసేనకు 23శాతం ఓటింగ్‌ వచ్చిందన్నారు. 270కి పైగా పంచాయతీల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పదవులు దక్కాయని చెప్పారు. అలాగే, 1654 పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు రెండో స్థానంలో నిలబడ్డారని, ఈ విజయాలు ఆనందాన్నిచ్చాయన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు ఎదురొడ్డి ఆడపడుచులు సైతం బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీచేయడం ప్రశంసనీయమన్నారు. మొదటి, రెండు విడతల్లో గెలుపొందిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ అభ్యర్థులతో నిన్న ఫోన్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్టు పవన్‌ చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని