వైకాపా అరాచకాలపై పోరాడుదాం: పవన్‌ - pawan kalyan press meet
close
Published : 23/01/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపా అరాచకాలపై పోరాడుదాం: పవన్‌

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో 142 ఆలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ.. వేరే మతాలపై దాడి జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడతారు. కానీ, హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పట్టించుకోరా అని నిలదీశారు.

 ‘‘హిందువుల పట్ల ఒకలా, ఇతర మతాల పట్ల ఒకలా స్పందించటం తప్పు. అన్ని మతాల పట్ల సమభావమే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండటమా? ఏ మాత్రం బాధ్యత లేకుండా వైకాపా సర్కారు వ్యవహరిస్తోంది. ఓ రథం పోతే ఇంకో రథం చేయిస్తామంటారా ప్రభుత్వ పెద్దలు? రాష్ట్రంలో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియాతో చిన్న చిన్న పోస్టులు పెడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. శాంతి భద్రతలను కాపాడాలని కోరితే వారిపైనా కేసులు పెడుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అదృష్టం అందలమెక్కిస్తే బుద్ధి బురదలో పొర్లిందన్న రీతిలో సాగుతోంది వైకాపా పాలన. పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన నేతలు.. పేకాట క్లబ్బులను నిర్వహించే స్థాయికి దిగజారారు. మీడియాపై కూడా దాడులు పెరుగుతున్నాయి. రామతీర్థం వచ్చి ఆందోళన చేయడానికి మాకు క్షణం పట్టదు. మతం కంటే మానవత్వం ముఖ్యమని జనసేన నమ్ముతుంది. ఎన్నికల్లో పోటీకి నిలబడిన వారిపై దాడులు చేసే సంస్కృతి మంచి పద్ధతి కాదు. ఈ అరాచకాలపై అందరూ సమష్టిగా పోరాడాల్సిన అవసరముంది. అందుకు జనసేన పార్టీ ముందుంటుంది’’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 

ఇవీ చదవండి..

శ్రీవారి సేవలో పవన్‌ కల్యాణ్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని