RRR: వచ్చే టీవీ ఛానళ్లు.. ఓటీటీలు ఇవే..! - pen studios announces rrr digital and satellite rights
close
Updated : 26/05/2021 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: వచ్చే టీవీ ఛానళ్లు.. ఓటీటీలు ఇవే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. తాజాగా అభిమానులకు తీపి కబురు చెప్పింది. ఆ సినిమా పోస్ట్‌ థియేట్రికల్‌(థియేటర్‌లో విడుదల తర్వాత) డిజిటల్‌, శాటిలైట్‌ ప్రసార హక్కులను ‘పెన్‌ స్టూడియోస్‌’ దక్కించుకుంది. దేశంలోనే అతిపెద్ద సినిమా ఒప్పందంగా దీన్ని అభివర్ణిస్తూ ఒక ప్రకటన చేసింది. సినిమా ప్రసారం కానున్న డిజిటల్‌(ఓటీటీ), శాటిలైట్‌(టీవీ ఛానల్) వివరాలు కూడా పెన్‌ స్టూడియోస్‌ పంచుకుంది. 

1. డిజిటల్‌ భాగస్వాములు

Zee5 (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ)

NetFlix (హిందీ)

2. శాటిలైట్‌ భాగస్వాములు

Zee cinema (హిందీ)

‘Star మా’ (తెలుగు)తో పాటు తమిళం, కన్నడ కూడా స్టార్‌ ఛానల్స్‌ దక్కించుకున్నాయి.

Asianet (మలయాళం)

3. విదేశీ భాషలు

ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, టర్కిష్‌, స్పానిష్‌ భాషల్లో ప్రసార హక్కులు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌(Netflix) దక్కించుకుంది.

దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అల్లురి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గన్‌, సముద్రకని కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి బాణీలు కూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన చరణ్‌, తారక్‌ టీజర్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని