‘రాధేశ్యామ్‌’ దసరాకి వస్తాడా? - prabhas radhe shyam is going to relaese in dasara
close
Published : 09/06/2021 22:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్‌’ దసరాకి వస్తాడా?

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ కుమార్‌ దర్వకత్వంలో రొమాంటిక్‌ చిత్రంగా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ని అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌,  గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా ఆలస్యమౌతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా రెండో దశ ఉధృతి తగ్గుతుండంతో సినిమాలు తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ, పూర్తిస్థాయి ఆక్యుపెన్సీతో షోలు ప్రదర్శితం కావడానికి మరికొంత సమయం పడుతుంది. అందువల్ల చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఇంకొంచెం సమయాన్ని తీసుకొని దసరాకి విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చిత్రానికి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందిస్తుండగా, మనోజ్‌ పరమహంస ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. ఇందులో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తుండగా సచిన్‌ ఖడేకర్‌, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కృనాల్‌ రాయ్‌ కపూర్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని