రావణ పాత్రధారి బతికే ఉన్నారు - raavan actor arvind trivedi not dead clarifies ramayan co-star sunil lahri
close
Published : 06/05/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రావణ పాత్రధారి బతికే ఉన్నారు

ఫొటో షేర్‌ చేసిన నటుడు సునీల్‌

ముంబయి: ప్రముఖ దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్‌’. 1980లో ప్రసారమైన ఈ ధారావాహికతో రావణుడిగా ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు అరవింద్‌ త్రివేది. కాగా, అరవింద్‌ త్రివేది ఆరోగ్య పరిస్థితి గురించి ఇటీవల ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. ఆయన కొవిడ్‌తో మృతి చెందారని గత కొన్నిరోజుల నుంచి వరుస కథనాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై రామాయణ్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్‌ లహ్రీ స్పందించారు. అరవింద్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని సూచించారు.

అరవింద్‌తో దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం ఎక్కువగా ఫేక్‌ న్యూస్‌ వినాల్సి వస్తోంది. అరవింద్‌ త్రివేది మృతి చెందారని వస్తోన్న పుకార్లు తాజాగా మా దృష్టికి వచ్చాయి. ఈ విధమైన వదంతులను వ్యాప్తి చేస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. దయచేసి ఇలాంటి వాటిని ఇకనైనా ఆపండి. దేవుడి దయవల్ల అరవింద్‌ జీ ఆరోగ్యంగానే ఉన్నారు’ అని సునీల్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని