14న ‘రాధేశ్యామ్‌’ నుంచి ఏం రాబోతుంది? - radhe shyam teaser update
close
Updated : 10/02/2021 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

14న ‘రాధేశ్యామ్‌’ నుంచి ఏం రాబోతుంది?

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. ఇప్పుడీ చిత్రం అప్‌డేట్‌పై సందేహం నెలకొంది సినీ అభిమానుల్లో. ఇటీవలే చిత్ర దర్శకుడు ఫిబ్రవరి 14న రాధేశ్యామ్‌ గ్లింప్స్‌ రాబోతుందంటూ ట్వీట్‌ చేశారు. తాజాగా డబ్బింగ్‌ పూర్తిచేసిన నాయిక పూజా ఓ ఫొటోను పంచుకుంటూ  ‘మన టీజర్‌ కోసం ఉదయాన్నే డబ్బింగ్‌ పూర్తిచేశాను. ఫిబ్రవరి 14న వచ్చేస్తుంది’ అని ట్వీట్‌ చేసింది. పూజా ట్వీట్‌ని నిర్మాణ సంస్థ ‘RadheShyamGlimpsOnFeb14th’ హ్యాష్‌ ట్యాగ్‌తో రీ ట్వీట్‌ చేయడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ప్రేమికుల రోజు కానుకగా ఈ పీరియాడికల్‌ ప్రేమకథకు సంబంధించి టీజర్‌ రాబోతుందా, కేవలం గ్లింప్స్‌ మాత్రమే వస్తుందా? అనే సందేహంలో ఉన్నారు ప్రభాస్‌ అభిమానులు.

మరి చిత్రబృందం ఏం విడుదల చేయబోతుందో తెలియాలంటే మూడు రోజులు ఆగాల్సిందే.  ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, టీ సిరీస్‌ సంస్థలు సమర్పిస్తున్నాయి.  యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. అధికభాగం ఇటలీలో చిత్రీకరణ జరుపుకొంది. ‘జిల్‌’ తర్వాత రాధాకృష్ణ నుంచి రానున్న చిత్రం కావడం, చాలాకాలం అనంతరం ప్రభాస్‌ పూర్తి స్థాయి ప్రేమ కథలో నటిస్తుండటంతో అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఇదీ చదవండి..

ఈ బతుకు అవసరమా అనిపించింది: శ్రీలక్ష్మి

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని