Rajkundra: రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! - rajkundra may enter into still more trouble
close
Updated : 25/07/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajkundra: రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చిన ఉద్యోగులు!

ముంబయి: అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణలతో పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు వారు సీబీఐని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ వివరాల్ని వెల్లడించేందుకు రాజ్‌కుంద్రా సహకరించడం లేదని క్రైం బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చిన నలుగురు ఉద్యోగులు ఈ కేసులో కీలకంగా మారనున్నారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మేజిస్ట్రేట్‌ సమక్షంలో త్వరలో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ముంబయిలోని రాజ్‌కుంద్రాకు చెందిన వియాన్‌ ఇండస్ట్రీస్‌ కార్యాలయంలో శనివారం పోలీసులు సోదాలు నిర్వహించారు. వీరికి ఓ లాకర్‌ లభ్యమైనట్లు తెలుస్తోంది. అందులో పలు వ్యాపార ఒప్పందాలు, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. క్రైం బ్రాంచ్‌ వీటిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాకర్‌ని రహస్యంగా ఉంచారని.. అందుకే గతంలో నిర్వహించిన సోదాల్లో ఇది బయటపడలేదని సమాచారం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని