Ram charan: అభిమానులను ప్రశంసించిన హీరో - ram charan appreciate his fans for helping other in covid times
close
Published : 06/06/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ram charan: అభిమానులను ప్రశంసించిన హీరో

హైదరాబాద్‌: కథానాయకుడు రామ్‌చరణ్‌ తన అభిమానులపై ప్రశంసలు కురిపించాడు. కరోనా కష్టకాలంలో తమవంతు సాయం అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా అభిమానులు చేస్తున్న సేవలను మెచ్చుకుంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘అభిమానులు ఈ కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సామాన్యుడికి సహాయం చేయటం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వరకూ మీరు ఎంతో అంకితభావంతో పని చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎందరికో సహాయం చేసిన మీకందరికీ నా శుభాభినందనలు. మీ అందరి అంకిత భావానికి నా ధన్యవాదాలు’’ -ఇన్‌స్టాలో రామ్‌చరణ్‌

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైన వారికి ఆక్సిజన్‌ అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ‘చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంకు’లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వ్యవహారాలను రామ్‌చరణ్‌ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఆయన కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెరకెక్కుతోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని