శంకర్‌-చరణ్‌ మూవీ: బ్యాక్‌డ్రాప్‌ అదేనా? - ram charan play different character in shankar movie
close
Updated : 30/03/2021 16:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంకర్‌-చరణ్‌ మూవీ: బ్యాక్‌డ్రాప్‌ అదేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.

శంకర్‌ అంటే భారీతనానికి పెట్టింది పేరు. అదే సమయంలో చరణ్‌కు మాస్‌లో మంచి ఇమేజ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని శంకర్‌ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పొలిటికల్‌ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందని ఓ టాక్‌. గతంలో ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఇందులో చరణ్‌ పాత్ర ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్‌ అధికారి సీఎం అయితే, సమాజంలో ఎలాంటి మార్పు తెచ్చాడన్న ఇతివృత్తంతో కథ సాగుతుందట. అంతేకాదండోయ్‌, మరో వార్త కూడా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మెడికల్‌ మాఫియా నేపథ్యంలో ఈ కథ ఉంటుందని మరో టాక్‌. మరి మెగా హీరోను.. ఈ మెగా డైరెక్టర్‌ ఎలా చూపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

తర్వాత శంకర్‌ చిత్రమేనా?

రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇవి పూర్తయిన వెంటనే రామ్‌చరణ్‌ నేరుగా శంకర్‌ క్యాంపులో చేరిపోతారని టాక్‌. మరోవైపు శంకర్‌ ‘భారతీయుడు2’ ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో వీలైనంత త్వరగా చరణ్‌ సినిమాను మొదలు పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని