‘రామ్‌ సేతు’లో అక్షయ్‌ ఫస్ట్ లుక్‌ చూశారా! - ram setu is a special film for me: akshay kumar
close
Published : 30/03/2021 23:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రామ్‌ సేతు’లో అక్షయ్‌ ఫస్ట్ లుక్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామ్ సేతు’. చంద్ర ప్రకాష్ ద్వివేది సమర్పణలో వస్తోన్న సినిమాకి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెలలో (మార్చి 18న) అయోధ్య రామ జన్మభూమిలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకి సంబంధించి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. పోస్టర్లో పొడవాటి నెరిసిన జుత్తుతో, కళ్లద్దాలు - నీలి రంగు చొక్కా ధరించి ఉన్నారు. నటుడు అక్షయ్‌ ఈ ఫోటోను తన ట్వీటర్లో షేర్‌ చేస్తూ..‘‘ఈ రోజు నేను చేసే ప్రయాణంలో ఈ చిత్రం చాలా ప్రత్యేకమైనది. ‘రామ్‌ సేతు’ షూటింగ్ ప్రారంభమైంది! ఇందులో పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నా’’ అంటూ పేర్కొన్నారు. సినిమాలో జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, నుష్రాత్‌ భరుచ్ఛా ప్రధాన కథానాయికలుగా నటిస్తున్నారు. ఇది భారతదేశం - శ్రీలంకలను కలిపే ‘రామ సేతు’ వారధి నేపథ్యంలో భారతీయ సాస్కృతిక, చారిత్రక వారసత్వ మూలాల ఆధారంగా చిత్రం రూపొందుతోంది. అక్షయ్‌, ధనుష్‌, సారా అలీఖాన్‌ కలిసి నటించిన చిత్రం ‘అత్రాంగి రే’. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని