అజయ్‌ బర్త్‌డే.. ఆర్‌ఆర్‌ఆర్‌ సర్‌ప్రైజ్‌ - rrr spl suprise on ajaydevgn birthday
close
Updated : 02/04/2021 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అజయ్‌ బర్త్‌డే.. ఆర్‌ఆర్‌ఆర్‌ సర్‌ప్రైజ్‌

మోషన్‌ పోస్టర్‌ విడుదల

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అజయ్‌ దేవ్‌గణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పాత్రను తెలియజేసేలా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. శుక్రవారం అజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సినీప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, హాలీవుడ్‌ తారలు ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవెన్‌సన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని అక్టోబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని