నాగార్జున అంటే చాలా ఇష్టం: సయామీ  - saiyami kher interview
close
Updated : 27/03/2021 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగార్జున అంటే చాలా ఇష్టం: సయామీ 

హైదరాబాద్‌: తెలుగులో ‘రేయ్‌’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన భామ సయామీఖేర్‌. ఆ తర్వాత హిందీ, మరాఠీ చిత్రాల్లో నటిగా అలరిస్తోంది. తాజాగా నాగార్జునతో కలిసి ‘వైల్డ్‌డాగ్‌ ‌’లో నటించింది. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సయామీ ఖేర్‌ పంచుకున్న విశేషాలు మీకోసం...

తొలుత ఈ సినిమా గురించి మిమ్మల్ని ఎవరు సంప్రదించారు?

సయామీ: ముందుగా చిత్ర దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ ‘వైల్డ్ డాగ్‌’ గురించి చెప్పారు. ఇదొక యాక్షన్‌ చిత్రం. 

తెలుగులో ఇది ఎన్నో సినిమా?

సయామీ: నేను తెలుగులో మొదటగా ‘రేయ్‌’ చిత్రంలో నటించాను. ఆ తర్వాత ఇప్పుడు నాగార్జున్‌తో కలిసి ‘వైల్డ్ డాగ్‌’లో నటిస్తున్నా. 

నాగార్జునతో కలిసి పనిచేయడం ఎలా అనిపిస్తోంది?

సయామీ: ప్రతి ఒక్క నటి నాగార్జునతో కలిసి పనిచేయాలని కోరుకుంటుంది. ఆయన కథానాయకుడిగా నటించిన ‘గీతాంజలి’ సినిమా అంటే ఎంతో ఇష్టం. గతంలో నాగ్‌సర్‌ని ఎప్పుడూ కలవలేదు. తొలిసారిగా సెట్లోనే కలుసుకున్నా.

ఈ చిత్రంలో మీ మొదటి సన్నివేశం ఎక్కడ చిత్రీకరించారు?

సయామీ: ఇందులో నా మొదటి సన్నివేశం గోడౌన్‌లో టెర్రిరిస్టుల్ని ఇంటరాగేట్‌ చేస్తుంటారు. తొలుత ఎలా ఉంటుందా అని టెన్షన్‌ పడ్డాను. కానీ, నాగార్జునతో కలిసి నటిస్తుంటే చాలా సరదాగా ఉంది. సెట్లో  నాగ్‌ (సర్‌) అందరితోనూ సరదాగా ఉంటారు. ఫుల్‌గా ప్రాక్టికల్‌ జోకులు వేస్తూ నవ్విస్తుంటారు.

మీరు రెగ్యులర్‌గా చేసే పాత్రలకు ఈ యాక్షన్‌ చిత్రానికి పూర్తి భిన్నం. ఎలా చేశారు?

సయామీ: నేను చిన్నప్పట్నుంచి క్రికెట్‌, బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. మారథాన్‌లో రన్నర్‌ని. క్రీడల్లో నాకు చాలా పట్టుంది. సినిమా కోసం ముంబయి మార్షల్‌ ఆర్ట్స్ లో నెలపాటు శిక్షణ కూడా తీసుకున్నా.

ఈ చిత్రంలో మీ పాత్ర ఏంటి?

సయామీ: ఇందులో నా పాత్ర పేరు ఆర్య పండిట్‌. రా ఏజెంట్‌. నాగార్జున ఎన్‌ఐఏ ఏజెంట్‌ విజయ్‌ వర్మగా కనిపిస్తారు. మేమంతా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తుంటాం.

మీరు క్రీడా నేపథ్యం నుంచి వచ్చారు కదా? ఈ చిత్రంలో మీకు అది ఎంతవరకు ఉపయోగపడింది?

సయామీ: మనలో ఎవరికైనా బాడీ ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఇది యాక్షన్‌ చిత్రం. కొవిడ్-19 తర్వాత చాలా చోట్ల సినిమా షూటింగ్‌ చేశారు. అడవుల్లో పనిచేయడం, పరిగెత్తడం లాంటి కష్టమైన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. వీటిని అధిగమించడానికి నా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ ఎంతో ఉపయోగపడింది.  

ఈ చిత్రంలో మీకేమైనా పాటలు, హాస్య సన్నివేశాలు ఉన్నాయా?

సయామీ: ఇందులో అలాంటి ఏమీ లేవు. పూర్తిగా యాక్షన్‌ చిత్రం. ఈ కథ నాకెంతగానో నచ్చింది. కొవిడ్‌ సమయంలోనే సినిమా షూటింగ్‌ మనాలిలో జరిగింది.

మీకు ఇష్టమైన నటులు ఎవరు? ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నారు?

సయామీ: రాజమౌళి అంటే ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. తాజాగా రామ్‌ చరణ్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్’ సీతారామరాజు లుక్‌ చూశా. చాలా బాగుంది. హీరోల్లో ప్రభాస్‌, అల్లు అర్జున్‌, దర్శకుల్లో మణిరత్నం, తరుణ్ భాస్కర్‌లతో పనిచేయాలని ఉంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని