సరదాగా కాసేపైనా.. సరిజోడై నీతో ఉన్నా  - saradaga song from pagal
close
Published : 01/04/2021 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరదాగా కాసేపైనా.. సరిజోడై నీతో ఉన్నా 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సరదాగా కాసేపైనా.. సరిజోడై నీతో ఉన్నా.. సరిపోదా నాకీ జన్మకి’ అని అంటున్నారు విష్వక్‌ సేన్‌. ఈయన హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పాగల్‌’. నివేదా పేతురాజ్‌ , మేఘాలేఖ, సిమ్రన్‌ చౌదరి నాయికలు. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘సరదాగా కాసేపైనా’ అనే పాట విడుదలైంది. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని కార్తీక్‌, పూర్ణిమ ఆలపించారు. రధన్‌ స్వరాలు సమకూర్చారు. నివేదా, విష్వక్‌లపై తెరకెక్కిన గీతమిది. వినసొంపుగా సాగుతూ అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. దిల్‌రాజు సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై వేణు గోపాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని