‘మహా సముద్రం’లో శర్వానంద్‌ ఇలా..! - sarwannad birthday posters
close
Published : 06/03/2021 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మహా సముద్రం’లో శర్వానంద్‌ ఇలా..!

హైదరాబాద్‌: మొదటి నుంచి విలక్షణ కథలు ఎంచుకుంటూ, ప్రామిసింగ్‌ నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు యువ హీరో శర్వానంద్‌. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా త్వరలో రాబోతున్న ఆయన చిత్రాల పోస్టర్లను, ఫస్ట్‌లుక్‌లను ఆయా చిత్రబృందాలు ట్విటర్‌ వేదికగా విడుదల చేశాయి. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న ‘మహాసముద్రం’లోని మోషన్‌ పోస్టర్‌లో శర్వానంద్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో సిద్ధార్థ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అదితిరావు హైదరీ, అనూ ఇమ్మానుయేల్‌ కథానాయికలు. అలాగే కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వా హీరోగా తెరకెక్కుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. నేటి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తునట్టు అందులో పేర్కొన్నారు. ఈ సినిమాలో రష్మిక.. శర్వానంద్‌ సరసన ఆడిపాడనుంది. అలాగే తాజాగా విడుదలైన ‘శ్రీకారం’ ట్రైలర్‌లో శర్వానంద్‌ చెబుతున్న ప్రతీ డైలాగ్‌ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని