ICC WTC Finals: 22-24 మందితో కోహ్లీసేన? - selectors to select 22 member squad for clash vs new zealand
close
Updated : 07/05/2021 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ICC WTC Finals: 22-24 మందితో కోహ్లీసేన?

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి చూపు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై పడింది. ఇందుకోసం సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించనున్నారని తెలిసింది. చేతన్‌శర్మ నేతృత్వంలోని కమిటీ 22-24 మందితో టీమ్‌ఇండియాను ప్రకటించనుందని సమాచారం. ఇప్పటికే 35 మందితో కూడిన ప్రాబబుల్స్‌ జాబితాను బోర్డుకు సమర్పించారట. దానిని బట్టే బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది. వచ్చే వారం చివర్లో తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

ప్రస్తుతం భారత్‌ నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో టీమ్‌ఇండియాను ప్రత్యేక విమానంలో బీసీసీఐ ఇంగ్లాండ్‌కు పంపించనుంది. వెళ్లగానే ఆటగాళ్లు బ్రిటన్‌లో పది రోజులు క్వారంటైన్‌కు అవుతారు. జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడతారు. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడతారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిశాక దాదాపుగా నెల రోజుల సమయం ఉంటుంది. అప్పుడు ఐదు టెస్టుల కోసం కోహ్లీసేన సన్నద్ధం అవుతుంది.

ఇక జూన్‌ 2న ఆరంభమయ్యే ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ 20 మందితో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించింది. ఆ తర్వాత టీమ్ఇండియాతో తలపడే ప్రపంచ టెస్టు సిరీస్‌ ఫైనల్‌ కోసం 15 మందితో జట్టును ఎంపిక చేయనున్నారు. ఇక సెప్టెంబర్లో ఇంగ్లాండ్‌ సిరీస్‌ ముగిశాక బహుశా ఐపీఎల్‌ రెండో దశ ఉండొచ్చు!!



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని