బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్‌? - shrutihasan in balakrishna movie
close
Published : 17/05/2021 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. చిత్రానికి సంబంధించి దర్శకుడు పనులు మొదలుపెట్టారు. ఇందులో నాయికగా శ్రుతిహాసన్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్‌ దర్శకత్వంలో శ్రుతిహాసన్‌ పలు సినిమాలు చేసింది. ఈ ఏడాది విడుదలైన ‘క్రాక్‌’లోనూ నాయికగా అలరించింది. బాలయ్య సినిమా కోసం గోపీచంద్‌ - శ్రుతిహాసన్‌ని సంప్రదించారని, అందుకు ఆమె వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందని చెప్పుకొంటున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చేస్తున్నారు. సినిమాని దసరా నాటికి తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అప్పుడే సినిమాని ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రుతిహాసన్‌ - ప్రభాస్‌ కథానాయకుడిగా ‘సలార్‌’లో  నటిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని