సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌: ఇంటికే విమాన భోజనం - singapore crazy initiatives amid pandamic
close
Published : 06/10/2020 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌: ఇంటికే విమాన భోజనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా విమానయాన సేవలు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. ప్రయాణికులు లేక, ఆదాయం రాక అనేక విమానయాన సంస్థలు డీలాపడ్డాయి. అయితే సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ సమస్యలను అధిగమించడం కోసం మూడు వినూత్న సేవలను తీసుకొస్తోంది.  

తరచూ విమానాల్లో ప్రయాణించే వారికి విమానంలో లభించే భోజనం మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతోందట. దీనిని గమనించిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో అందించే భోజనాన్ని హోం డెలివరీ చేస్తామని ప్రకటించింది. అక్టోబర్‌ 4న అర్ధరాత్రి ఈ సేవలు ప్రారంభించగా.. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు 50కిపైగా ఆర్డర్స్‌ వచ్చాయట. విమానంలో అందించే బిజినెస్‌ క్లాస్‌ భోజనం ధర 288 యూఎస్‌ డాలర్లు(రూ. 21వేలు), ఫస్ట్‌క్లాస్‌ భోజనం ధర 488 యూఎస్‌ డాలర్లు(రూ.35 వేలు) ఉంటుంది. జీఎస్టీ అదనం. ఈ భోజనంతోపాటు వైన్‌ బాటిల్‌ కూడా ఇస్తారట. 

దీంతోపాటు మరో రెండు వినూత్న సేవలను సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ అందుబాటులోకి తేనుంది. చాంగి విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఏ-380 జంబో జెట్‌ విమానంలో తాత్కాలిక రెస్టారెంట్‌ ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్‌ 24, 25 తేదీల్లో ఈ రెస్టారెంట్‌ను తెరవనున్నారు. ఈ విమాన రెస్టారెంట్లో భోజనం చేయాలనుకుంటే అక్టోబర్‌ 12 నుంచి రిజర్వేషన్‌ బుక్‌ చేసుకోవచ్చట. మరోవైపు విమానంలో సిబ్బందికి ఇచ్చే శిక్షణను ప్రజలకు కూడా ఇవ్వనున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. నవంబర్‌ 21, 22, 28, 29 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయట. చిన్నారులకు 16.06డాలర్లు, పెద్దలకు 32.10డాలర్లు ఫీజు ఉంటుందని పేర్కొంది. ఈ శిక్షణకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నవంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని