Sonu Sood: సోనూ.. నా గర్ల్‌ఫ్రెండ్‌కు ఐఫోన్‌ కావాలి! - sonu sood hilarious reply for twitter user asking for iphone for his girlfriend
close
Published : 23/06/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonu Sood: సోనూ.. నా గర్ల్‌ఫ్రెండ్‌కు ఐఫోన్‌ కావాలి!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఎంతో మందికి మానవతావాదులు తమవంతు సాయం చేస్తున్నారు. సాయం చేసే వారి జాబితాలో ముందు వరుసలో ఉన్నారు సినీ నటుడు సోనూసూద్‌. సామాజిక మాధ్యమాల వేదికగా సాయమడిగిన వారికి కాదనకుండా చేయూతనిస్తున్నారు. కాగా, అప్పుడప్పుడు కొందరు నెటిజన్లు సాయమడుగుతున్న తీరు, అందుకు సోనూసూద్‌ సరదాగా స్పందించటం నవ్వులు పూయిస్తోంది.

తాజాగా ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా సోనూసూద్‌ను ఓ కొంటె కోరిక కోరాడు. ‘బ్రదర్‌.. సోనూసూద్‌.. నా గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతోంది. మీరేమైనా సాయం చేయగలరా’ అంటూ అడగ్గా, అందుకు సోనూసూద్‌ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘నాకు ఆ విషయం గురించి తెలియదు. కానీ, నేను ఆమెకు ఫోన్‌ ఇవ్వడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘కొందరికి ఏం సాయం అడగాలో తెలియదు. వాళ్ల మైండ్‌లో ఏది అడగాలనిపిస్తే, అది అడుగుతారు. ఏదేమైనా సోనూసూద్‌ అదిరిపోయే సమాధానం ఇచ్చారు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టగా, సోనూ చేసిన ట్వీట్‌కు అనేక సరదా సమాధానాలు, ఫన్నీ ఎమోజీలను నెటిజన్లు జోడిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని