‘జాతిరత్నాలు’ వీక్షించిన కృష్ణ - superstar krishna watched jathiratnalu
close
Updated : 22/03/2021 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జాతిరత్నాలు’ వీక్షించిన కృష్ణ

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని తాజాగా వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోని నటుడు నరేష్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఆయనతో కలిసి ఫుల్‌టైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ వీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ‘‘సూపర్‌స్టార్‌తో కలిసి ‘జాతిరత్నాలు’ వీక్షించాను. ఆ సినిమా ఓ నవ్వుల బాంబు. భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఆ సినిమా ఖ్యాతి గడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కథానాయకుడు నవీన్‌పోలిశెట్టి, దర్శకుడు అనుదీప్‌, నిర్మాత నాగ్‌ అశ్విన్‌తోపాటు స్వప్నా సినిమాస్‌ టీమ్‌ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’’ అని నరేష్‌ పేర్కొన్నారు. మరోవైపు ఈ సినిమాలో నరేష్‌.. హీరోయిన్‌ ఫరియా తండ్రి పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

నవీన్‌ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్‌ దర్శకత్వం వహించారు. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్‌ అశ్విన్‌ నిర్మాత. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 11న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. నవ్వుల వర్షం కురిపిస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని