Talibans: కామెడీ వీడియోలు పోస్టు చేస్తున్నాడని హత్య! - taliban admit killing comic who was beaten hands tied in viral video
close
Published : 31/07/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Talibans: కామెడీ వీడియోలు పోస్టు చేస్తున్నాడని హత్య!

కాందహార్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకుని వారి ఆగడాలను కొనసాగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో హాస్యాస్పదమైన వీడియోలు పంచుతున్నాడంటూ ఫజల్‌ మహమ్మద్‌ అనే పోలీసు అధికారిని ఎత్తుకెళ్లి హత్య చేశారు. ఫజల్ మహమ్మద్ తన కామెడీ వీడియోలతో ఖాషా జ్వాన్‌ అనే పేరుతో పాపులర్‌ అయ్యారు. దక్షిణ కాందహార్‌ ప్రావిన్స్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో ఆయన విధులు నిర్వర్తించేవారు. విధులు ముగించుకొని రెండు వారాల క్రితమే ఖాషా జ్వాన్‌ తన ఇంటికి వెళ్లారు. అయితే వారం రోజుల క్రితమే ఆయనను తాలిబన్లు అపహరించి చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. చేతులు వెనక్కి కట్టేసి, కారులో కూర్చోబెట్టుకొని ఫజల్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

హాస్యభరితమైన వీడియోలు పంచుకున్నందుకే ఖాషా జ్వాన్‌ను హత్య చేశారని పోలీసులు పేర్కొంటున్నారు. తాలిబన్లను కించపరిచే, వ్యతిరేకించే వీడియోలు ఆయన ఎప్పుడూ చేయలేదని.. అయినా వారు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. అయితే ఫజల్ మహమ్మద్ హత్యను తాలిబన్ల ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్‌ సమర్థించుకున్నారు. ‘అతడు కమెడియన్‌ కాదు. చురుకైన పోలీసు అధికారి. పలు పోరాటాల్లో మాతో పోట్లాడారు. అనేక మంది ప్రాణాలను తీశాడు. మేము అతడిని బంధించేందుకు వెళ్లినప్పుడు పారిపోయేందుకు కూడా ప్రయత్నించాడు. అందుకే మా వాళ్లు ఫజల్‌ను చంపేశారు’ అని పేర్కొన్నాడు.

కమెడియన్‌ ఖాషా జ్వాన్ హత్య పట్ల అఫ్గాన్‌ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారని వాపోతున్నారు. ఫజల్‌ హత్య పట్ల అఫ్గాన్ రెండో ఉపాధ్యక్షుడు సర్వాద్‌ దానేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి మీద ఉన్న సంస్కృతి, కళ, స్వేచ్ఛతో కూడా తాలిబన్లు శత్రుత్వం పెంచుకుంటున్నారని మండిపడ్డారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని