Electricity bill : చిన్న హోటల్‌కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు - telugu news Rs 21 crore Electricity bill for a small hotel in west godavari
close
Updated : 09/09/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Electricity bill : చిన్న హోటల్‌కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు

చింతలపూడి గ్రామీణ, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కొత్త బస్టాండు సమీపంలో చిన్నపాటి టిఫిన్‌ హోటల్‌ నిర్వహిస్తున్న ముళ్లగిరి మంగమ్మకు రూ.వేలు, రూ.కోట్లలో విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. సాధారణంగా ప్రతి నెలా రూ.600-రూ.700 మధ్యలో బిల్లు వస్తుండగా.. ఆగస్టులో రూ.47,148 బిల్లు రావడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటరులో లోపం ఉందంటూ విద్యుత్తు సిబ్బంది కొత్తది బిగించారు. సెప్టెంబరులో రూ.21,48,62,224 బిల్లు రావడంతో మంగమ్మ మళ్లీ అధికారులను ఆశ్రయించారు. ఏడీఈ రాధాకృష్ణ మాట్లాడుతూ సాంకేతిక లోపంతో ఇంత బిల్లు వచ్చి ఉంటుందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని