RRR: ఎన్టీఆర్‌ని ఐడీ కార్డుతో ఎప్పుడైనా చూశారా - telugu news actor ntr with id card on sets of rrr
close
Published : 06/08/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ఎన్టీఆర్‌ని ఐడీ కార్డుతో ఎప్పుడైనా చూశారా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐడీ కార్డు వేసుకున్న ఎన్టీఆర్‌ని మీరు ఎప్పుడైనా చూశారా? లేదు అంటే ఇప్పుడు ఇక్కడ చూసేయండి. అయినా ఎన్టీఆర్‌కి ఐడీ కార్డుతో పనేంటి అనుకుంటున్నారా? విద్యార్థులు, ఉద్యోగులకు ఉన్నట్టే సినిమాలకి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు ఉంటుంది. విదేశాలకు వెళ్తే అవి తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రస్తుతం తారక్‌  ఉక్రెయిన్‌లో ఉన్నాడు. అందుకే ఐడీ కార్డు ధరించాడు. ‘నేను ఐడీ కార్డు వేసుకుని చాలా సంవత్సరాలైంది. తొలిసారి సెట్స్‌లో ఇలా’ అంటూ ఆ ఫొటోల్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తోపాటు దర్శకుడు రాజమౌళి తన ఐడీ కార్డు చూపిస్తూ కనిపించారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌తో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పాటల చిత్రీకరణ కోసం ఇటీవల చిత్రబృందం ఉక్రెయిన్‌ వెళ్లింది. ఈ చిత్రంలో అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ‘దోస్తీ’ గీతం విశేషంగా అలరించింది. ఈ సినిమా అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని