‘వావ్‌’ అనిపించిన సాయి కుమార్‌ ఫ్యామిలీ! - telugu news actor sai kumar family fun on wow game show etv ravi shankar ayyappa kamala priya adi
close
Published : 22/07/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వావ్‌’ అనిపించిన సాయి కుమార్‌ ఫ్యామిలీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు సాయి కుమార్‌ కుటుంబమంతా కలిసి బుల్లితెరపై సందడి చేసింది. ఈటీవీలో ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ‘వావ్‌ 3.. మాంచి కిక్‌ ఇచ్చే గేమ్‌ షో’ ఈ హంగామాకి వేదికైంది. ఈ కార్యక్రమానికి సాయికుమార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. జులై 27 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రత్యేక ఎపిసోడ్‌ని రూపొందించారు. దీనికి సాయి కుమార్‌ సోదరులు రవిశంకర్‌, అయ్యప్ప, సోదరీమణులు కమల, ప్రియ, సతీమణి సురేఖ, తనయుడు ఆది తదితరులు అతిథులుగా విచ్చేశారు. ఈ ఎసిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

‘వావ్‌ అంటే వినోదం.. వావ్‌ అంటే విజ్ఞానం.. వావ్‌ అంటే ఉల్లాసం.. వావ్‌ అంటే ఉత్సాహం’ అంటూ సాయికుమార్‌తో కలిసి ఆయన సోదరసోదరీమణులు చెప్పే సంభాషణలతో ప్రారంభమైన ఈ ప్రోమో ఆద్యంతం అలరిస్తోంది. మీరు ఎప్పుడు పుట్టారు? అని సాయికుమార్‌  అడగ్గా అయ్యప్ప, ప్రియ తేదీ మాత్రమే చెప్పి, సంవత్సరం చెప్పకుండా వాళ్ల హావభావాలతో నవ్వులు పూయించారు. వ్యాఖ్యాతగా సాయి కుమార్‌ అడిగిన ఇతర ప్రశ్నలకు ఆయన సోదరులు సమాధానం చెప్పిన విధానం, ముగ్గురు అన్నదమ్ములు చెప్పిన డైలాగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాయి కుమార్‌ నటించిన ‘అంతఃపురం’ చిత్రంలోని  ‘అసలేం గుర్తుకురాదు’ పాట చూసిన ప్రతిసారి తనకి ఎందుకు కోపం వస్తుందో సురేఖ ఈ వేదికపై తెలియజేశారు. ఇలా అందరూ ఒకే వేదికపై కనిపించి ‘వావ్‌’ అనిపించారు. పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే జులై 27 (మంగళవారం) వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని